టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు.అయితే ఈయన గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా చందూ మొండేటి దర్శకత్వంలోనే కార్తికేయ 2 సినిమాని తెరకెక్కించారు.ఇకపోతే సినిమా రిలీజ్ కి ముందు ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొని చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. అయితే కృష్ణుడి కథ ఆధారంగా తీసుకోవడంతో నార్త్ లో మరింత భారీ విజయం సాధించింది ఈ సినిమా.కాగా కార్తికేయ 2 సినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా ఒక్క బాలీవుడ్ నుంచే 25 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి.
అయితే ఈ సినిమాతో నిఖిల్ కి కూడా బాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది.కాగా బాలీవుడ్ లో తను మరింతమందికి తెలియడానికి నార్త్ లోని పలు నగరాల్లో చిత్రయూనిట్ తో కలిసి ప్రెస్ మీట్స్ పెడుతున్నాడు.ఇకపోతే అక్కడి మీడియాకి కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నిఖిల్. ఇదిలావుంటే తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు.అయితే నిఖిల్ తాజాగా ఇచ్చిన ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఈ సినిమా వల్ల నాకు బాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా ప్రేక్షకులు నన్ను గుర్తుపడుతున్నారు.ఇక ఒక రెండు బాలీవుడ్ సంస్థల నుంచి నాకు ఆఫర్స్ కూడా వచ్చాయి.
అయితే ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. మరిన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం నేను ఏ ప్రాజెక్టు ఓకే చెయ్యట్లేదు. ఇక ఇప్పుడు ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నాను.అయితే ప్రస్తుతానికి ఏ బాలీవుడ్ ఆఫర్ ని ఓకే చేయలేదు” అని తెలిపాడు. అయితే ఇక నిఖిల్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు, అభిమానులు అభినందిస్తున్నారు.కాగా కొంతమంది హీరోల లాగా హిట్ రాగానే గర్వం తెచ్చేసుకొని బాలీవుడ్ వెళ్ళిపోయి, మన సినిమాలని వదిలేయలేట్లేదు. అంతేకాకుండా తనకి లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ లోనే సినిమాలు తీయాలని నిఖిల్ అనుకుంటున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు..!!