రొమాంటిక్ భామ కి అదెంతో ముఖ్యం!!

P.Nishanth Kumar
సినిమా పరిశ్రమలో ఎవరైనా రాణించాలి అంటే తప్పకుండా వారికి సక్సెస్ అనేది ప్రామాణికంగా ఉంటుంది. సక్సెస్ అందుకున్న వారే ఎక్కువ రోజులు సినిమా పరిశ్రమలో ఉండగలిగే అర్హత కలుగుతుంది. దానికి తోడు వారికి మంచి క్రేజీ ఏర్పడడంతో ఆటోమేటిక్ గా వారి కి సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా హీరోయిన్లు సక్సెస్ వచ్చే సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు పోవాలి. లేదంటే మధ్యలోనే వారి కెరియర్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.

ఇప్పటిదాకా చాలా మంది హీరోయిన్లు వచ్చే సినిమాలను ఎంపిక చేసుకుంటూ టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. ఇంకో కొంతమంది మంచి సినిమాలను ఎంపిక చేసుకోలేక మధ్యలోనే తమ కెరీర్స్ ను క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ విధంగా తొలి సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ కేతిక శర్మ ఇ  ప్పుడు రెండవ సినిమాతో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతుంది. వైష్ణవ్ తేజ్ హీరో గా రూపొందిన రంగ రంగ వైభవం గా సినిమా రేపు విడుదల కాబోతుంది. ఈ సినిమా ఆమె కు తప్పకుండా మంచి విజయం తీసుకు రావాల్సిన సినిమా అని చెప్పొచ్చు. 

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ లు ఎవరూ కూడా టాప్ పొజిషన్లో లేరు ఇప్పుడు ఆమె చేస్తున్న రంగా రంగా వైభవంగా సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకుంటే మాత్రం తొందరగానే ఆమె టాప్ పొజిషన్ కు వెళ్లడం ఖాయం అని చెప్పవచ్చు. యువ హీరోయిన్లలో ముగ్గురికి టాప్ హీరోయిన్ కి వెళ్లే అవకాశం ఉంది. వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. మరి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ముద్దుగుమ్మ కూడా టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాన్ని అందుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం కొన్ని సినిమాలు ఉన్నాయి వాటిలో ఆమె ఏ స్థాయిలో నటించి ఎదుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: