నవ్వుతూ కనిపించే యాంకర్ సుమ.. ఆమె లేని లోటుతో బాధ పడుతుందట?
ఇటీవలకాలంలో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తన మాటల గారడీతో అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా తన జీవితంలో జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. యాంకర్ సుమ తర్వాత ఎంతోమంది తెలుగు బుల్లితెరపై యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ సుమను మాత్రం బీట్ చేయలేకపోయారూ అని చెప్పాలి. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండే సుమా జీవితంలో కొంత కాలం క్రితం విషాదకర ఘటన జరిగింది అత్తమామలు దూరమయ్యారు.
అయితే సాధారణంగా అత్తా కోడళ్ళ మధ్య ఎప్పుడూ పడదు అని అంటూ ఉంటారు. కానీ సుమా మాత్రం తన అత్తను తల్లి తర్వాత తల్లిలా చుసుకునేది. ఎంతో ప్రేమ ఆప్యాయతలు చూపించేది. ఈ క్రమంలో తన అత్తగారు తమ పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేదని ఆమె మరణం తర్వాత ఆమె లేని లోటు బాగా తెలుస్తుంది బాధ పడిందట. మనుషులు కానీ వస్తువులు కానీ మన వద్ద ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు ఎప్పుడైతే మనకు దూరం అవుతాయో వాటి విలువ మనకు తెలిసి వస్తుంది. ఇటీవలే అత్తగారు బ్రతికున్నప్పుడు తనని ఎంతో ప్రేమగా చూసుకునేది లేకుండా తల్లి ప్రేమను కూడా మైమరిపించేలా చేసేది అని సుమ తన స్నేహితులతో చెప్పుకొని బాధ పడిందట.