విడాకుల తర్వాత.. సుమంత్ అందుకే రెండో పెళ్లి చేసుకోలేదట?
సత్యం అనే సినిమా ద్వారా ఊహించని రీతిలో పేరు సంపాదించుకున్న సుమంత్.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు.. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్ తన పెళ్ళికి సంబంధించి ఎన్నో విషయాలను తెలిపాడు. సినీ ఫీల్డులో ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకున్నంత మాత్రాన విడిపోరు అన్న గ్యారంటీ ఇవ్వలేము అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు సుమంత్. ఎంతోమంది సినిమా ఫ్యామిలీ వాళ్ళు ఇలా కలుసుకున్నారు. అలా విడిపోయారు అంటూ తెలిపాడు. అయితే కలిసి ఉండటం కొంత మందికి అవసరం కాని అందరికీ కాదు అంటూ తెలిపాడు.
అంతేకాకుండా తనను వదిలేసి వెళ్లిపోయిన అమ్మాయి మర్చిపోలేకపోతున్నా అనే మాట మాత్రం నిజంగా అబద్ధమే. ఎందుకంటే నేను చాలా సంతోషం గానే ఉన్నాను. నా లైఫ్ లో మళ్లీ తనను కలవాలని ఎప్పుడూ కూడా అనిపించలేదు అంటూ తన మాజీ భార్య కీర్తి రెడ్డి గురించి సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే డబ్బు సంపాదన కోసమే సినిమాలు చేయాల్సిన అవసరం లేదని.. సినిమాలో నా క్యారెక్టర్ వేరు నిజ జీవితంలో నేను వేరు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక భార్యాభర్తలు ఎవ్వరూ కూడా తన సలహాలను తీసుకోవద్దు అంటూ చెప్పుకొచ్చాడు. లైఫ్ లో హ్యాపీగా లేని వారే పాత విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇక నేను జీవితంలో సంతోషంగా ఉన్నాను కాబట్టి రెండో పెళ్లి మాట నా జీవితంలో లేదు అంటూ సుమంత్ తెలిపాడు.