అందాల ముద్దు గుమ్మ
కృతి సనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1 నేనొక్కడినే
మూవీ తో
వెండి ధరకు పరిచయం అయ్యింది . 1 నేనొక్కడినే
మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ
బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది . అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ కు
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి
సినిమా అవకాశాలు దక్కాయి .
అలాగే ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు మంచి విజయాలు సాధించడం తో ప్రస్తుతం
కృతి సనన్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ
హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా
కృతి సనన్ 'కాపీ విత్ కరణ్' షో లో పాల్గొంది. ఈ షో లో భాగంగా
కృతి సనన్ మూవీల్లోకి వచ్చిన కొత్తలో పడిన ఇబ్బందుల గురించి చెప్పు కొచ్చింది.
తాజాగా
కాఫీ విత్
కరణ్ షో లో
కృతి సనన్ మాట్లాడుతూ ...
లస్ట్ స్టోరీస్ ఆడిషన్స్ లో పాల్గొన్నట్లు , అయితే ఆ
మూవీ లో చాలా బోల్డ్ సన్నివేశాలు ఉండడంతో వెనకడుగు వేసినట్లు తెలియజేసింది. అలాగే అలాంటి పాత్ర చేయడానికి అమ్మ అంగీకరించదు అని , అందుకే వాటి విషయంలో మినహాయింపు ఇవ్వాలని దర్శకుడు
కరణ్ ని కోరినట్లు
కృతి సనన్ చెప్పు కొచ్చింది. అలాగే కెరీర్ ప్రారంభంలో తన పొడవు కూడా సమస్యగా మారినట్లు చెప్పు కొచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
కృతి సనన్ , ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
ఆది పురుష్
మూవీ లో నటిస్తోంది.