ఇకనైనా జాతి రత్నాల డైరెక్టర్ జాగ్రత్త పడాల్సిందేనా..!!

Divya
పిట్టగోడ అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టర్ గా మారిన అనుదీప్ కె.వి ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు. అయితే ప్రస్తుతం హీరో శివ కార్తికేయంతో కలిసి ప్రిన్స్ అని సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా కంటే ముందుగా ఫస్ట్ డే.. ఫస్ట్ షో అనే చిత్రానికి డైరెక్షన్ చేయకపోయినా ఈ సినిమాకు కథ మాటలు అందించారు కానీ ఈ సినిమా తన శిష్యుడు వసిందర్ లక్ష్మీనారాయణకు దర్శకత్వ బాధ్యతలను అప్పగించడం జరిగింది అయితే ఈ సినిమా జనాలకి తీసుకువెళ్లే బాధ్యత మాత్రం తన మీద వేసుకున్నారు అనుదీప్. అందుచేతనే ఈ సినిమాని తన మీదనే ప్రమోట్ చేయడం జరిగింది.
స్టార్ కాస్టింగ్ లేకపోయినా ప్రమోషన్ హడావిడి చేసి ప్రేక్షకుల దృష్టిని తన వైపు ఆకర్షించేలా చేసుకున్నాడు జాతి రత్నాలు డైరెక్టర్. కేవలం జాతి రత్నాలు డైరెక్టర్ అనే అంశంతోనే ఈ సినిమా చాలా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమాకి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనవంతు సపోర్టు కూడా చేయడం జరిగింది అలాగే చిరంజీవి కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం మిక్సెడ్ టాక్ ను తెచ్చుకున్నది.
శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు అనే నూతన నటీనటులను ఈ సినిమాతో పరిచయం చేశారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రమైన ఖుషి ఫస్ట్ డే ఫస్ట్ షో కి టికెట్లు సంపాదించడమే అనే పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అయితే ఇది వినడానికి బాగానే ఉన్న ఈ సినిమా తీయడంలో మేకర్స్ మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని ఒక షార్ట్ ఫిలిం గా తీసి ఉంటే బాగుండు అని ఆడియన్స్ తెలియజేస్తున్నారు. జాతి రత్నాలు సినిమాలలో కూడా పెద్దగా కథ లేదు కేవలం కామెడీ పరంగా సినిమా దూసుకు వెళ్ళింది. అయితే అనుదీప్ తాను ఏం రాసిన కూడా జనాలు నవ్వుతూ ఉంటారని భ్రమలో ఉన్నట్లుగా పలువురు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇలాగే సినిమా తీస్తే తను చేయబోయే సినిమాలు ఫ్లాప్  అవుతాయని కూడా హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: