టాలీవుడ్ యంగ్
హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన
సినిమా `లైగర్`.
టాలీవుడ్ సీనియర్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ పాన్
ఇండియా సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.విజయ్
దేవరకొండ కెరీర్ లో తొలి పాన్
ఇండియా సినిమా కావడంతో పాటు బాలీవుడ్లో ఈ సినిమాను ఫేమస్ దర్శక
నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉండి ప్రమోట్ చేయడంతో.. నేషనల్ వైడ్ గా లైగర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.పైగా రిలీజ్ కి ముందు
సినిమా 200 కోట్లు వసూలు చేస్తుంది, ఇండియాని షేక్ చేస్తుంది, వాట్ లగా దెంగె అంటూ
విజయ్ ఓవర్ యాక్షన్ చేశాడు.దీనికి తోడు `ఇస్మార్ట్
శంకర్ ` లాంటి సూపర్ హిట్
సినిమా తర్వాత
పూరి దర్శకత్వం వహిస్తుండడంతో లైగర్ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే తొలిరోజే ఈ
సినిమా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ
సినిమా నిర్మాతలతో పాటు కొన్న బయ్యర్లు అందరూ భారీగా నష్టపోయారు. లైగర్
సినిమా కోసం జరిగిన ప్రమోషన్లు చూసి ఈ
సినిమా రూ. 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కలెక్షన్లు సాధిస్తుందని అందరూ అంచనా వేశారు.
కట్ చేస్తే లైగర్ కు పెట్టిన పెట్టుబడిలో ఏకంగా 80 శాతానికి పైగా అందరూ నష్టపోయారు. ఈ
సినిమా ప్లాప్ అవడంతో
పూరి జగన్నాథ్ తన రెమ్యూనరేషన్ తో పాటు కలెక్షన్లలో తనకు వాటాగా వచ్చిన 70% డబ్బులను కూడా వెనక్కి ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ
సినిమా కోసం
హీరో విజయ్ ఏకంగా రూ. 35 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే ఈ
సినిమా కోసం ప్రత్యేకంగా
మైక్ టైసన్ ను రంగంలోకి దింపారు. ఆయనకే ఏకంగా 35 కోట్లు ఇచ్చారు.ఇక ఈ
సినిమా దెబ్బకు భారీగా నష్టపోయిన
ఛార్మి తీవ్ర ఆవేదనలో కూరుకుపోవడంతో..విజయ్ ఆమెను ఓదార్చే క్రమంలో తన రెమ్యూనరేషన్ నుంచి 6 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చినట్టు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు భారీగా అప్పుల్లో కూరుకుపోయిన
ఛార్మి ఆ సినిమాతో కాస్త కోలుకుంది. ఇప్పుడు లైగర్ దెబ్బతో మరోసారి
ఛార్మి పూర్తిగా కుదేలు అయిపోయిందని సోషల్ మీడియాలో ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు.