ఇటీవల పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన సినిమా లైగర్ .అయితే ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈ దెబ్బతో చార్మి సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించగా విజయ్ దేవరకొండ మాత్రం తన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టారు. కాగా లైగర్ సినిమా విడుదలైన రోజే విజయ్ దేవరకొండ ఫలితంతో సంబంధం లేకుండా జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోని విజయ్ దేవరకొండ టీం షేర్ చేసింది.అయితే దీంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టాడని ప్రచారం జరుగుతోంది.
కాగా ఇప్పటికే విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ అనే సినిమా చేస్తున్నాడు.అంతేకాదు సమంతా రూత్ ప్రభు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి 70% షూటింగ్ పూర్తయింది. అయితే.ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద రూపొందిస్తున్నారు.కాగా విజయ్ దేవరకొండ సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇక సుకుమార్ ఇంకా పుష్ప సీక్వెల్ సినిమా ప్రారంభించలేదు.ఇకపోతే.ఆ సినిమా పూర్తి చేసిన తర్వాతే విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా చేసే అవకాశం ఉంది. అయితే ఇక ఈ క్రమంలో విజయ్ దేవరకొండ గతంలో దిల్ రాజుకు దగ్గర తీసుకున్న అడ్వాన్సుకు గాను ఆయనతో ఒక సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా దిల్ రాజు తన బ్యానర్ లో సినిమాలు చేసే దర్శకులకే ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇకపోతే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న హరీష్ శంకర్ తో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.అయితే.హరీష్ శంకర్ ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత ఖుషి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండ హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఖుషి సినిమాతో ఎలా అయినా హిట్ కొడతారని విజయ్ దేవరకొండ అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు.ఇక శివ నిర్వాణ లవ్ స్టోరీస్ తీర్చిదిద్దడంలో సిద్ధ హస్తుడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా హిట్టు కొట్టవచ్చు అని వారు నమ్ముతున్నారు..!!