మెగా ఫ్యామిలీలో త్వరలో ఆ హీరో పెళ్ళికొడుకు కాబోతున్నాడా..!!

Divya
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో చాలానే ఉందని చెప్పవచ్చు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నుండి యువ హీరో సందీప్ కిషన్ వరకు చాలామంది ఉన్నారు. అయితే ఎంతో మంది హీరోలు వివాహానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారి పెళ్లి వార్త మాత్రం చెప్పకుండా ఉంటున్నారు.అలాంటి వారిలో ముందుగా ప్రభాస్ ఉన్నారని చెప్పవచ్చు పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే ఈ సినిమా తర్వాత అంటూ ఎప్పటికప్పుడు పెళ్లి వార్తను ముందుకు నెట్టుకుంటూ వస్తున్నాడు. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం హీరో రామ్ పోతినేని తన స్నేహితురాలని వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.


అయితే ఈ వార్తలను సోషల్ మీడియా ద్వారా కొట్టివేస్తూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక అడవి శేషు వంటి హీరోలు నేను సింగిల్ కాదంటూ హింట్ ఇస్తున్నప్పటికీ.. పెళ్లి గురించి మాత్రం ఏ విధంగా తెలియజేయడం లేదు ఈ నేపథ్యంలోనే మెగా కుటుంబం నుంచి ముగ్గురు హీరోల పెళ్లి ప్రస్తావన మొదలైనట్లుగా సమాచారం. అలా మెగా కుటుంబం నుంచి సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ ఈ ముగ్గురు 30 సంవత్సరాలు వయసు పైబడి ఉన్నారని చెప్పవచ్చు.


ఈ ముగ్గురు హీరోలలో సాయి ధరంతేజ్ ,వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఇంట్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వరుణ్ తేజ్ పెళ్లి గురించి మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలే తెలియజేసినట్లుగా కూడా తెలుస్తోంది. వరుణ్ తేజ్  ఇష్టప్రకారమే ఎప్పుడంటే అప్పుడు వివాహం చేస్తానని నాగబాబు గతంలో తెలియజేశారు. ఇక సాయి ధరంతేజ్ తల్లి కూడా గత కొన్ని నెలలుగా తనకు వివాహం చేయాలని చూస్తున్నట్లుగా గతంలో ఒకసారి తెలియజేయడం జరిగింది. మరి వీరిద్దరిలో ఎవరు ముందు వివాహం చేసుకుంటారని ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు. ఇక అల్లు శిరీష్ మాత్రం ప్రేమ కాదంట అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే వివాహం గురించి మాత్రం ఇంకా ప్రస్తావన రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: