ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్
మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వీరిద్దరి కాంబినేషన్
మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ
మూవీ ని పాన్
ఇండియా స్థాయి కంటే మించి తొమ్మిది భాషలలో విడుదల చేయాలని
మూవీ యూనిట్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా తొమ్మిది భాషల్లో
మూవీ ని విడుదల చేయాలి అని
మూవీ యూనిట్ డిసైడ్ కావడంతో ఈ
సినిమా స్క్రిప్ట్ పనులు మరింత పక్కాగా ఉండే విధంగా
కొరటాల శివ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
అందు కోసమే ఈ
మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడం కాస్త డిలే అవుతున్నట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ
మూవీ లో స్లిమ్ గా కనబడడం కోసం కాస్త బరువు తగ్గే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ లో
ఎన్టీఆర్ సరసన
అనన్య పాండే హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.