టాలీవుడ్ యంగ్
హీరో లలో ఒకరు అయినటువంటి
రామ్ పోతినేని మరి కొన్ని రోజుల్లో
టాలీవుడ్ మాస్ దర్శకుడు అయినటు వంటి
బోయపాటి శ్రీను దర్శకత్వం లో తేరకెక్కబోయే
మూవీ లో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ ని తెలుగు తో పాటు
కన్నడ , మలయాళ ,
తమిళ ,
హిందీ భాషల్లో పాన్
ఇండియా స్థాయిలో విడుదల చేయ బోతున్నారు .
అలాగే ఈ
మూవీ ని
తండ్రి కొడుకుల మధ్య ఉండే సెంటి మెంట్ తో తెరకెక్కించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది . ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో సరికొత్త లుక్ లో కనబడడం కోసం
రామ్ పోతినేని కొంత బరువును కూడా పెరగడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తుంది . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే
రామ్ పోతినేని 'ది వారియర్'
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఇక
బోయపాటి శ్రీను పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ
మూవీ కి దర్శకత్వం వహించాడు. అఖండ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించండి.