ఇకనైనా నివేద థామస్ కు అవకాశాలు వస్తాయా..?
అంతేకాదు ఏ పాత్రలో నటించిన సరే లీనం అయిపోయి నటించే ఈ ముద్దుగుమ్మ తెలుగులో నానితో రెండు సినిమాలు చేయగా రెండూ కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఎన్టీఆర్ కి జోడిగా జై లవకుశ సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది.. రజనీకాంత్ కి కూతురు పాత్రలో కూడా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ .. ఇటీవల పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తో వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.. ఈ సినిమా తర్వాత పెద్దగా ఈమెకు అవకాశాలు రాలేదు. కానీ యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు వచ్చాయి. కానీ ఆఫర్లను తిరస్కరించింది .అయితే ఎందుకు అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉండే నివేదా థామస్ రెండు సంవత్సరాల క్రితం నటించిన షాకిని డాకినీ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది. ఇద్దరు కలిసి ఈ సినిమాలో హీరయిన్ లుగా నటించారు. సురేష్ బాబు ఈ సినిమాని సమర్పిస్తున్న కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమాతో నైనా ఈమె కు అవకాశాలు వస్తాయో లేదో తెలియాల్సి ఉంది.