Nc-22 చిత్రంతో నైనా చైతూ సక్సెస్ అయ్యేనా..!!

Divya
వరుసగా నాలుగు సినిమాలతో మంచి విజయంలో ఉన్న నాగచైతన్యకు థాంక్యూ సినిమా ఒక్కసారిగా షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇటీ వలె ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకొని బాలీవుడ్లో లాల్ సింగ్ చద్ద సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చైతన్యకు ఈ సినిమా కూడా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు చైతన్య తన తదుపరిచిత్రం పైన ఫోకస్ పెట్టి కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

నాగచైతన్య హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్రావు డైరెక్షన్లో ఒక చిత్రం రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు NC-22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు ఈ చిత్రం నాగచైతన్య కెరియర్ లోని భారీ బడ్జెట్ చిత్రంగా సమాచారం.ఈ చిత్రం బైలింగ్విల్ మూవీ గా తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి . త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అప్డేట్ను అందించారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి సెప్టెంబర్ మూడవ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభం కానున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ఇందులో నాగచైతన్య తో పాటు ఇతర నటీనటుల సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్నది. ఇక నాగచైతన్య కృతి శెట్టి కి ఇద్దరికీ కూడా ప్రస్తుతం సక్సెస్ అవసరమని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నాగచైతన్య ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ఇది సినిమాలో మాస్ యాక్షన్ తో కూడిన అంశాలు ఉండబోతున్నట్లు సమాచారం. మరి చిత్రంతో విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: