మహేష్ బాబు ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా.. వీడియో వైరల్..!!
ఇప్పటికి ఇంకా స్టార్ హీరోగా కొనసాగుతూనే ఉన్నారు మహేష్ బాబు. ఇక ఈ మధ్యకాలంలో షో లకు , ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక మహేష్ బాబు ఫిజిక్ విషయానికి వస్తే.. తన ముఖంలో ఇంత గ్లో తగ్గకపోవడానికి గల కారణం ఏంటా అని అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంటారు. ఎన్నో ఇంటర్వ్యూలలో ఎంతో మంది మహేష్ బాబుని ఇలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే మహేష్ బాబు ఎప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉంటారు. అయితే తాజాగా మహేష్ బాబుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతుంది ఇదే తన ఫిట్నెస్ సీక్రెట్ కి సమాధానం అన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.
మహేష్ బాబు అందంగా ఫిట్నెస్ గా కనిపించడానికి ముఖ్య కారణం ఆయన వర్క్ అవుట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రెడ్ మిల్ రన్నింగ్ చూస్తే మనకు ఆ విషయం అర్థం అవుతుంది. ఈ మిషన్ మీద మహేష్ బాబు రన్నింగ్ ఏంటా అంటూ అభిమానుల సైతం షాక్ అవుతున్నారు. ఇలాంటి ఎన్నో కష్టమైన వర్క్ అవుట్ ల వల్లే మహేష్ బాబు చూడడానికి ఇలా అందంగా కనిపిస్తున్నారని అభిమానుల సైతం భావిస్తున్నారు. మహేష్ ఇంట్లో అధునాతన పరికరాలతో కలిగిన జిమ్ పరికరాలు ఎక్కువగా ఉన్నాయి.