ఫ్లాప్ లోచ్చినా రాశీ ఖన్నా కి మంచి ఛాన్స్ లు!!
నటిగా మంచి నటీమణి అయినప్పటికీ ఆమెకు సినిమా అవకాశాలు రావడం తగ్గాయి. దాంతో ఆమె కెరీర్ అయిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ తాజాగా ఆమెకు ఓ మంచి సినిమా అవకాశం రావడం విశేషం. తొలి చిత్రంతోనే తన బబ్లీ బబ్లీ లుక్స్ తో చుపుపతో అందరిని ఆకట్టుకుంది.. దాంతో ఆమెపై అందరి కళ్ళు పడ్డాయి. ముద్దు ముద్దుగా బొద్దుబొద్దుగా ఉన్న ఈ అమ్మాయి ఎవరా అని అందరు ఆమెను తమ సినిమాలలో పెట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. అందానికి అందం అభినయానికి అభినయం ఉండడంతో పెద్ద హీరోలు సైతం ఆమెకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
అలా తాజాగా ఈ ముద్దుగుమ్మ కి శర్వానంద్ తో కలిసి నటించే అవకాశం అందుకుంది. ఒకే ఒక జీవితం చేసిన తర్వాత ఈ హీరో మరో మంచి సినిమా కి శ్రీకారం చుట్టారు. ఆ సినిమా లో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ నే ఎంచుకోవడం విశేషం. ఇటు శర్వానంద్ కూడా వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. ఈ హీరోయిన్ కూడా పెద్దగా హిట్స్ అందుకోలేదు. దాంతో వీరిద్దరూ మంచి హిట్స్ కొడతారా అనేది చూడాలి. గతంలో వీరి కాంబో లో ఒక్క సినిమా కూడా రాలేదు. దాంతో తొలి సారి కలిసి చేస్తున్న ఈ కాంబో సినిమా పై మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయి అని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ సినిమా వీరిద్దరికి ఏమాత్రం కలిసి వస్తుంది చూడాలి.