కోలీవుడ్
ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న
హీరో లలో ఒకరు అయినటు వంటి కార్తీ తాజాగా విరుమాన్ అనే
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ
మూవీ లో అదితి
శంకర్ ,
ప్రకాష్ రాజ్ , రాజకిరణ్ ముఖ్య పాత్ర లలో నటించగా , ఎం. ముత్తయ్య ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు . 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ
మూవీ ని
సూర్య మరియు
జ్యోతిక లు నిర్మించారు .
ఈ
మూవీ కి యువన్
శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. ఈ
మూవీ భారీ అంచనాల నడుమ 12 ఆగస్ట్ 2022 వ తేదీన
తమిళ భాషలో విడుదల అయ్యింది. ఈ
మూవీ కి
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఈ
మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఎంత గానో మెప్పించిన ఈ
సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది.
విరుమాన్ సినిమా ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది ఈ
మూవీ ని
సెప్టెంబర్ 11 వ తేదీ నుండి
తమిళ భాషలో
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు
అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఎంత గానో మెప్పించిన విరుమన్
సినిమా 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.