బ్రహ్మస్త్ర: వామ్మో.. RRRనే మించిపోయిందిగా?

Purushottham Vinay
బాలీవుడ్ లో రణ బీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ డైరెక్టర్ గా కరణ్ జోహార్ నిర్మించిన చిత్రం బ్రహ్మస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్ర విజయంని చిత్ర యూనిట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హిందీతో పాటు ఇతర భాషల్లో మూవీని విజయవంతం చేయాలని చాలా భారీగా ప్రమోట్ చేస్తున్నారు.రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన బ్రహ్మస్త్ర సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది.బాలీవుడ్ బిగ్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున కీలక రోల్స్ చేస్తున్నారు. తెలుగులో బ్రహ్మాస్త్రం చిత్రాన్ని రాజమౌళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ క్రమంలో సీరియస్ గా ప్రమోట్ చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో భారీ చిత్రాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో మేకర్స్ లో ఆందోళన నెలకొంది. అయితే వాళ్ళ ఆందోళనకు ఉపశమనం కలిగించేలా అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తుంది.



సెప్టెంబర్ 6 ఉదయం 11:30 సమయానికి మేజర్ థియేటర్ చైన్స్ ఐనాక్స్, సినీప్లెక్స్, పివిఆర్ లలో 1.31 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఆర్ ఆర్ ఆర్, భూల్ బులయా 2 అడ్వాన్స్ బుకింగ్స్ కంటే ఎక్కువ. ఆ విధంగా ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రహ్మాస్త్ర అధిగమించింది.అయితే కెజిఎఫ్ చాప్టర్ 2 కంటే చాలా వెనుక ఉంది. కెజిఎఫ్ 2 హిందీ ఏకంగా 5.05 లక్షల టికెట్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. సోషియా ఫాంటసీ నేపథ్యంలో విజువల్ వండర్ గా రూపొందించారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో బ్రహ్మస్త్ర సత్తా చాటుతుండగా... మరోవైపు బాయ్ కాట్ సెగలు భయపెడుతున్నాయి. ప్రతి రోజూ బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అనే నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ నెటిజన్స్ ట్రెండ్ చేస్తున్నారు. నిర్మాత కరణ్ జోహార్ తో పాటు అలియా భట్, రణ బీర్ కపూర్ లపై ఉన్న కోపాన్ని ఇలా ప్రదర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: