గోల్డెన్ ఛాన్స్ అందుకున్న పూరి జగన్నాధ్...!!

murali krishna
లైగర్' ఎఫెక్ట్‌తో పూరీ జగన్నాధ్ దారుణమైన షాక్‌లో వున్నాడని తెలుస్తుంది.. భారీగా ఆశలు పెట్టుకున్న పూరీకి, అనూహ్యంగా డిజాస్టర్ ఫలితాన్ని మిగిల్చింది 'లైగర్'.


అది పూరీ నిర్లక్ష్యమా.? లేక ప్రేక్షకులిచ్చిన తీర్పేనా.? అనేది పక్కన పెడితే, 'లైగర్' ఫ్లాప్ నుంచి పూరీ ఇప్పుడప్పుడే తేరుకునేలా అయితే కనిపించడం లేదు.


ఈ సమయంలో పూరీపై ఓ మెరుపు మెరిసిందంటూ ప్రచారం అయితే జరుగుతోంది. మెగా కాంపౌండ్ నుంచి పూరీకి పిలుపొచ్చిందని సమాచారం.. స్వయానా మెగాస్టార్ చిరంజీవే ఆ వర్తమానం పంపించారని తెలుస్తుంది.మెగాస్టార్ చిరంజీవికి డై హార్ట్ ప్యాన్ పూరీ జగన్నాధ్.


ఎప్పటి నుంచో చిరంజీవితో సినిమా తీయాలనుకుంటున్నాడు. అప్పట్లో 'ఆటో జానీ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నాడట చిరంజీవి కోసం. కానీ, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు అవకాశాలు కుదరలేదంతవరకూ. అప్పుడు కాన్సిల్ అయిన ప్రాజెక్టే ఇప్పుడు పట్టాలెక్కబోతోందనీ తెలుస్తోంది.


అందుకు సమయం వచ్చిందనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే, పూరీ జగన్నాధ్‌కి చిరంజీవి అభయమిచ్చాడని తెలుస్తుంది.. మనం కలిసి పని చేద్దాం అని హామీ ఇచ్చాడట. దాంతో, పూరీ పొలంలో మళ్లీ మొలకలొచ్చాయనిపిస్తోంది. అంతేకాదు, పూరీ డైరెక్షన్‌కే కాదు, తన సొంత బ్యానర్ అయిన పూరీ కనెక్ట్స్‌కీ ఇది ఓ ఛాలెంజ్‌లాంటిదే అని చెప్పవచ్చు.


పూరీ కనెక్ట్స్ బ్యానర్‌తో కలిసి కొణిదెల బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాలనుకుంటోందని తెలుస్తుంది.. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెల్లడి కానుందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. మరి ఇదే నిజమైతే మళ్లీ పూరీ కమ్ బ్యాక్ అవడం ఖాయమేమో అని అనిపిస్తుంది. మరి చూడాలి మెగా స్టార్ పూరికి ఆఫర్ ఇస్తారో లేదో. ఒకవేళ ఇస్తే పూరి జగన్నాధ్ ఆయనతో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి మరి. పూరి సినిమా అంటేనే ఆ హీరోకి సెపరేట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. లైగర్ సినిమాలో అది మిస్ అయింది. పూరి మార్క్ పంచెస్ కూడా లేవు అందులో మరి చూడాలి చిరంజీవి ని పూరి ఎలా చూపిస్తాడో మరి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: