ప్రభాస్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది గా...!!

Divya
ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అందులో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో నటించబోతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా విదేశీ భాషలలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ఇదివరకే ప్రకటించడం జరిగింది. ప్రభాస్ స్టార్ డమ్ తగ్గట్టుగానే స్పిరిట్ కథ ఉంటుంది అని డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. అయితే ఈ సినిమా పైన ఇప్పటివరకు చాలా చాలా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రం ప్రారంభం కాకుండానే విడుదల తేదీ మాత్రం ఎక్కువగా ప్రచారంలో జరుగుతోంది.


అంతేకాకుండా సినిమాలో హీరోయిన్ విషయంపై కూడా పలు పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు డైరెక్టర్ సందీప్ వంగ. గత కొన్న రోజులుగా  ఈ సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ నటి అయిన కరీనాకపూర్ నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్, కరీనాకపూర్  వీళ్ళిద్దరి కలయిక కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి సత్తా చాటుతుందని అభిమానులు భావించారు కానీ ఈ విషయంపై కరీనాకపూర్ నటించలేదని క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే సినిమాలో నటించేందుకు మాత్రం ఆసక్తిగా ఉన్నాను కానీ అవకాశం రాలేదని తెలియజేసింది.


అయితే మొత్తానికి ప్రభాస్ సినిమా విషయంలో హీరోయిన్ పై ఒక స్పష్టత వచ్చిందని చెప్పవచ్చు. ఇక కరీనా కపూర్ కాదని చెప్పడంతో మరొక హీరోయిన్ ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ ఎంపిక విషయం అయితే ఇప్పట్లో తేలే లాగా కనిపించడం లేదు. మరి ఈ లోపు ఎంతమంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తాయో చూడాలి మరి. దీంతో ప్రభాస్ నటించిన సినిమా వచ్చేయడాది షూటింగ్ ప్రారంభం కానుండని ఒక క్లారిటీ అయితే ప్రభాస్ అభిమానులకు వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: