ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని అనంతరం తనదైన నటనతో ఇప్పటికి కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతూ పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో వుంది సమంత.సమంత కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ , హాలీవుడ్ లో కూడా ఈమెకు ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి..పెళ్లి చేసుకొని పెద్దింటి కోడలైంది. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు బాగానే ఉన్న వీరి వివాహబంధం.. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.
వాళ్లు విడాకులు తీసుకుని సంవత్సరం దాటిన కూడా వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇదిలావుంటే ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత రెండవ వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..సమంత నాగ చైతన్య కి విడాకులు ఇచ్చి సినిమాల పరంగా బిజీగా మారింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత గురించి.. ఇప్పుడు..మళ్లీ పెళ్లి చేసుకోబోతుంది అని ఓ వార్త వైరల్ అవుతోంది.అయితే సమంత తన కాబోయే భర్త కోసమే జూబ్లీహిల్స్ లో ఒక కొత్త విల్లా ని కూడా కొనుగోలు చేసిందని, ఆ ఇంటిని పునరుద్ధరణ చేసే పనులు జయభేరి సంస్థ దగ్గరుండి చూస్తోందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది.అయితే సమంత బీహార్ కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని, అంతేకాక అతను కొన్ని నెలలుగా హైదరాబాదులో ఉన్న సమంత ఫ్లాట్ లోనే ఉంటున్నాడని తెలుస్తోంది. ఈ విషయం సమంత ఫ్లాట్ లో ఆ వ్యక్తిని స్వయంగా చూసిన ఓ డైరెక్టర్ ఇండస్ట్రీలోని కొంత మంది తో చెప్పడం వల్ల ఆ వార్త కాస్త బయటికి వచ్చిందని సమాచారం. ఇక సమంతకు ఆ వ్యక్తికి ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్లో పరిచయం ఏర్పడి అది కాస్తా పెళ్లి చేసుకునే వరకు దారి తీసిందని అంతేకాక నాగచైతన్యకు విడాకులు ఇవ్వడానికి కారణం కూడా ఆ వ్యక్తితో ఉన్న పరిచయమే అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అసలు విషయం బయట పడే వరకు వేచి చూడాల్సిందే..!!