రమ్యకృష్ణ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణవంశీ..!!
కృష్ణవంశీ మాట్లాడుతూ.. రమ్యకృష్ణ నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు. శ్రీ ఆంజనేయం సినిమా తర్వాత మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి అనేది నిజం కాదు అని ఆయన వెల్లడించారు. ఇక ఆమె డబ్బులు పెట్టుబడిగా పెట్టలేదని, రమ్యకృష్ణ అమాయకురాలు కాదు అని కృష్ణవంశీ తెలిపారు. ఇక కొడుకు సినిమాల్లోకి వస్తాడో లేదో అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం.ఇకపోతే కృష్ణవంశీ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది . ఈ సినిమాలో రమ్యకృష్ణ, అనసూయ, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో కృష్ణవంశీ భారీ సక్సెస్ ను అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి కొంతమంది ఇందులో రమ్యకృష్ణ నటిస్తోంది కాబట్టి పక్కా బ్లాక్ బాస్టర్ అంటూ ముందే జ్యోతిష్యం చెబుతూ ఉండడం గమనార్హం.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో విడుదల అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.