రాజా వారు రాణి గారు మూ వీతో వెండి తెరకు పరిచయం అయిన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజా వారి రాణి వారు మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' మూవీ లో హీరోగా నటించాడు. ఆ తర్వాత సెబాస్టియన్ , సమ్మతమే సినిమా లలో హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే కిరణ్ అబ్బవరం తాజాగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి శ్రీధర్ గాడే దర్శకత్వం వహించాడు. ఇది వరకే కిరణ్ అబ్బవరం , శ్రీధర్ గాడే కాంబినేషన్ లో ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తేరకెక్కింది.
నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ మీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. మణిశర్మ ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా , ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అనుకుంటాడో చూడాలి.