టాలీవుడ్ ఈ హీరోని పట్టించుకోవడం లేదా.. కారణం..!!

Divya
హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ పొజిషన్లోకి చేరుకున్నారు. ఇక మొదట పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అందరిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాలతో సంచలనంగా మారిపోయారు ఇక తర్వాత టాక్సీవాలా గీతగోవిందం వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇక డియర్ కామ్రేడ్ సినిమాతో ఒకసారిగా అభిమానుల సైతం నిరాశపరిచారు. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక అలా ఎన్నో సంవత్సరాలు గ్యాప్ తీసుకొని తాజాగా లైగర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం నెగటివ్ టాక్ ను తెచ్చుకోవడం జరిగింది.

ఈ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా కూడా మారడం జరిగింది విజయ్ దేవరకొండ. దీంతో వరుస సినిమాలు డబల్ డిజాస్టర్ గా మిగిలాయి. ఈ చిత్రాలు అన్ని టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచినట్లుగా ట్రెండ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. దీంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా అనిపించుకోవడమే కాకుండా అతని తదుపరి సినిమాల పైన క్రేజీ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లుగా అభిమానుల సైతం భావిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరినైనా సరే సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది దాన్ని బట్టి విజయ్ దేవరకొండ తన కెరీర్ ని ప్లాన్ చేసుకోవాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు అభిమానులు.

లైగర్ సినిమా ఫ్లాప్ అవడం వల్ల  డైరెక్టర్ పూరి జగన్నాధ కంటే విజయ్ దేవరకొండ పైన ఎక్కువగా ట్రోల్స్ వినిపించాయి. విజయ్ మాట్లాడిన మాటలు ఈ సినిమా కంటెంట్ కు ఏ మాత్రం పొంతన లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపించాయి. ఇండస్ట్రీలో తనని ఆపేవారు ఎవరూ లేరని యాటిట్యూడ్ తో మాట్లాడాడు విజయ్ దేవరకొండ. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి ఈ హీరో పైన ఇలాంటి నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక లైగర్ చిత్రం ఫలితంతో విజయ్ దేవరకొండ తన బాధని చెప్పుకోలేనంత నిరాశలో ఉన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: