ఉప్పెన సినిమాతో స్టార్
హీరోయిన్ హోదాను దక్కించుకున్న స్టార్ కృతి శెట్టి. ప్రస్తుతం ఈమె తెలుగులో హాట్ బ్యూటీగా తనదైన శైలిలో దూసుకుపోతోంది.ఈమె నటించిన ఉప్పెనతో ఈ
భామ ఓవర్ నైట్ స్టార్
హీరోయిన్ స్టేటస్ అందుకుంది. వరుసగా మూడు హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ నమోదు చేసిన ఈ భామ.. 'ది వారియర్' మూవీతో తొలి ఫ్లాప్‌ను అందుకుంది. తాజాగా నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీతో మరో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకుంది.ఇక దీంతో ఈ అమ్మడు ఐరెన్ లెగ్‌గా మారింది.అయితే ఇప్పుడు కృతి శెట్టి
సినిమా అంటే కాస్త సందేహాలు తలెత్తుతున్నాయి.
అక్కినేని
నాగ చైతన్యతో కృతి శెట్టి ఓ
సినిమా చేయబోతున్న విషయం తెలసిందే.ఇక త్వరలో ఈ
సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పటికే బంగార్రాజు సినిమాలో
నాగ చైతన్య రొమాన్స్ చేసి మంచి మార్కులు వేయించుకున్న అమ్మడు.. మరోసారి ఆయనతో నటించడానికి సిద్ధపడింది.కాగా నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ
సినిమా లో నటిస్తున్నాడు.ఇకపోతే ప్రయోగాత్మక కథాంశంతో యాక్షన్
లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో
కన్నడ బ్యూటీ కృతిశెట్టి
హీరోయిన్ గా ఎంపిక చేసిన్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు చిత్ర బృందం. ఈ
సినిమా కోసం కృతి శెట్టి ఫస్ట్ టైం మనకు ప్రేతాత్మ రోల్ లో కనిపించనుందట.
అయితే ఇప్పటివరకు అందంగా ట్రెడిషనల్ గా మోడ్రెన్ గా అలరించిన కృతి శెట్టి ఫస్ట్ టైం కెరియర్లో ప్రేతాత్మ రోల్ చేయనున్నట్లు.. దానికి తగ్గ
మేకప్ వేసుకొవడానికి సిద్ధపడిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .అంతేకాదు పెద్ద
హీరో సినిమాలో ప్రేతాత్మగా నటించడానికి ఒప్పుకోవడం షాకింగ్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాలో అమ్మడు డ్యూయల్ రోల్ నటించబోతుందని.. ఒకటి ప్రేతాత్మగా మరొకటి
నాగచైతన్య గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్నట్లు సమాచారం.మరికొద్ది రోజుల్లో కృతశెట్టి నటించిన ఈ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే
సినిమా రిలీజ్ కాబోతుంది.ఇక కృతి శెట్టి రానున్న సినిమాలు హిట్ అయితే అమ్మడి జోరు మళ్లీ కొనసాగుతుంది..!!