సమంత బాగా హార్ట్ అయ్యిందట!!

P.Nishanth Kumar
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలకి రోజుకొక సమస్య మొదలవుతుంది అని చెప్పాలి. వారి గురించి లేనిపోని కథనాలన్నీ కూడా ఇక్కడే పుట్టుకొస్తున్నాయి. ఎక్కడలేని ఇబ్బందులను తెచ్చి పెడుతున్న ఈ సోషల్ మీడియాను ఏ పెద్ద సెలబ్రిటీ కూడా అదుపు చేయలేకపోతున్నాడు. ఆ విధంగా ఇప్పుడు సమంతకు ఓ విషయం ఎంతగానో బాధపెడుతుందట. దాని గురించిన కథనాలు వెబ్సైట్ లలో కూడా రావడం ఆమె అభిమానులను ఎంతగానో బాధపడుతుంది. ఇటీవల ఆమె ఓ చర్మవ్యాధికి గురైందని దానివల్లే ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నిటిని ఆపేసిందని సోషల్ మీడియా లో చెబుతున్నారు.

 ఈ నేపథ్యంలోనే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోకుండా ఆమెను బాధపెట్టే విధంగా కొంతమంది ఈ విధం గా ఆమె గురించిన కథనాలను వెల్లడించడం నిజంగా ఆమె అభిమానులను ఎంతగానో బాధపడుతున్న విషయం అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తుంది తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అంతేకాకుండా పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది.

మరి ఈ సినిమాల షూటింగు చివరి దశలో ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాలు పూర్తి చేయాలి అంటే తప్పకుండా ఆమె షూటిం గ్ చేసి ఈ వార్తలన్నీటికి ముగింపు పలకాల్సిందే. ఖుషి సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో 23వ తేదీ విడుదల చేయడానికి ఇప్పటికే చిత్ర బృందం అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. యశోద సినిమా కూడా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఆమె గుణశేఖర్ సినిమాలో నటించినా శకుంతల సినిమా విడుదల ఎప్పుడు జరుగుతుందో ఇంకా క్లారిటీ రావ డం లేదు. ఇవి మాత్రమే కాకుం డా బాలీవుడ్ లో కూడా ఆమె ఓ సినిమాలో చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: