టాలీవుడ్ స్టార్
హీరో మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం
ఇండియన్ టాప్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరైన శంకర్‌తో ఓ
మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో
బాలీవుడ్ హాట్
బ్యూటీ కియారా అద్వానీ
హీరోయిన్ గా నటిస్తోంది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై
టాలీవుడ్ బడా
నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఇంకా ఇందులో అంజలి, శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర,
సునీల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో
తమిళ వెర్సటైల్ యాక్టర్ ఎస్జే
సూర్య కూడా భాగం అయ్యాయి. నేడు ఎస్జే
సూర్య పుట్టినరోజు కావడంతో.. `ఆర్సీ 15` మేకర్స్ ఓ
పోస్టర్ ను బయటకు వదిలి ఆయనకు తమ టీమ్‌లోకి ఆహ్వానం పలికారు.వాస్తవానికి ఈ మూవీలో
ఎస్ జె సూర్య పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి.
ఎట్టకేలకు ఇప్పుడీ వార్త నిజమైంది. కానీ, మేకర్స్ మాత్రం ఓ ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా విడుదల చేసిన
పోస్టర్ లో
సూర్య ఆఫీసర్ గెటప్ లో ఫైల్ చేతిలో పట్టుకుని సూటు, బూటుతో కనిపిస్తున్నారు.మెగా
పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఈ చిత్రంలో సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. దీంతో
సూర్య రోల్ ఏంటి..? ఆయనది విలన్ పాత్ర అయితే పోస్టర్లో అలాంటి లుక్‌లో ఎందుకు కనిపిస్తున్నారు..? ఒకవేళ సివిల్ అధికారిగానే ఉంటూ నెగిటివ్ షేడ్స్ లో నటిస్తున్నారా..? ఇలా రకరకాల ప్రశ్నలు తెరపై వస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఖచ్చితంగా మరికొంత కాలం వేచి చూడాల్సిందే.ఇక రీసెంట్ గా మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మంచి గ్లోబుల్ హిట్ కొట్టిన సంగతి తెలిసింది.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ
సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా 1150 కోట్ల వసూళ్లు రాబట్టింది.