పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన రెజీనా..!!
ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో నివేద థామస్ కూడా నటించడం జరిగింది. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ యాక్షన్ కామెడీ కిల్లర్ సినిమా ఈ నెల 16వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది ఈ నేపథ్యంలోని చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను చాలా విస్తృతంగా నిర్వహించారు. దీంతో ఈ సినిమా పైన మంచి హైట్ ఏర్పడిందని చెప్పవచ్చు ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా రెజీనా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
తన జీవితంలో వివాహం చేసుకుంటాను లేదో తెలియదు అంటూ బాంబు పేల్చింది దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్కు గురయ్యారు. నిజానికి గత కొద్దిరోజుల నుండి రెజీనా పెళ్లి విషయంపై పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి ఆమె సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకోంది అనే వార్తలు వినిపించాయి. అయితే రెజీనా ప్రేమ పెళ్లి పై స్పందిస్తూ.. తను గతంలో ఒకరిని ప్రేమించారని అయితే కొన్ని కారణాల చేత 2002లో విడిపోయామని... ఆ విషయం నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టింది అని తెలిపింది ఇప్పుడు మాత్రం ఎవరిని ప్రేమించలేదని సింగిల్ గానే ఉండాలని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.