అలనాటి కాలంలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎంతో కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన రమ్య కృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రమ్య కృష్ణ అలనాటి కాలంలో స్టార్ హీరోలు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలకృష్ణ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రమ్యకృష్ణ ఎన్నో మూవీ లలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. కొంత కాలం క్రితం విడుదల అయిన బాహుబలి మూవీ తో రమ్యకృష్ణ పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన గుర్తింపు దక్కించుకుంది.
రమ్యకృష్ణ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా అనేక మూవీ లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఎన్నో సంవత్సరాల పాటు కొన సాగింది. ప్రస్తుతం రమ్యకృష్ణ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న జైలర్ అనే తమిళ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో డాన్స్ ఐకాన్ అనే ప్రోగ్రాం మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రాం కు రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరించబోతుంది. ఈ విషయాన్ని ఆహా నిర్వాహక బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది.