మాటివిలో ప్రసరమయ్యే రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షోతో అఖిల్ సార్థక్‌కు అంతో ఇంతో క్రేజ్ వచ్చింది.అయితే బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు లక్ కొద్దీ రన్నర్‌గా నిలిచాడు. ఇక పోతే బిగ్ బాస్ ఓటీటీలోనూ తన బిహేవియర్, నేచర్‌తో రన్నర్‌గానే నిలిచాడు.ఇదిలావుంటే ఇక బిగ్ బాస్ షో తప్ప అఖిల్‌కు చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే అంతకు ముందు సీరియల్స్‌లో విలన్ రోల్స్ చేసినా, సహాయ పాత్రల్లో నటించినా కూడా అంతగా గుర్తింపురాలేదు. ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చాక అంతగా ఆఫర్లు కూడా ఏమీ రాలేదు. కాగా మోనాల్‌తో లవ్ ట్రాక్ అంతో ఇంతో వర్కవుట్ అయింది.
ఇక మోనాల్ అఖిల్ కాంబోలో ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేశారు. ఇంత వరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన అయితే రాలేదు. ఇక అలా మొత్తానికి అఖిల్‌కు మాత్రం ఇంకా సరైన బ్రేక్ రాలేదు.ఇకపోతే ఈ సమయంలోనే ఢీ షోకు వచ్చాడు.అయితే ఆ మధ్య ఢీ షోలో అఖిల్ బాగానే సందడి చేశారు. ఇక మళ్లీ ఓటీటీ నాన్ స్టాప్ షోకు వెళ్లడంతో ఢీ షోకు బ్రేక్ ఇచ్చాడు. అయితే నాన్ స్టాప్ నుంచి బయటకు వచ్చిన అఖిల్.. మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుని అదే ఢీ షోకు వచ్చాడు. ఇక అసలే ఢీ షోలో ఆది ఆధిపత్యమే నడుస్తుంటుంది.అయితే అతగాడే అందరి మీద పంచులు వేస్తుంటాడు....
వేరే వాళ్లకు చాన్స్ ఇవ్వడు.అయితే అలాంటి ఆది వరుసగా అఖిల్ మీద సెటైర్లు వేస్తుంటాడు. ఇక ఈ షోలో అఖిల్ పరువుతీస్తుంటాడు. ఇదిలావుంటే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ అఖిల్ మీద పంచులు వేశాడు.కాగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నేళ్లు అవుతోంది.. అని అఖిల్‌ను ఆది అడుగుతాడు. దానికి...పదేళ్లు అవుతుంది అని అఖిల్ సమాధానం ఇస్తాడు.ఆయన...అబ్బో పదేళ్లు అంటే.. ఎంత సంపాదించావ్ అని మళ్లీ అడుగుతాడు.ఇక బాగానే సంపాదించాను అని అఖిల్ అంటాడు.నువ్వు అంటే ఏం చేయకుండానే అంత సంపాదించావ్ అంటే.. చేసి ఉంటే ఇంకెంత సంపాదించేవాడివో అని కౌంటర్లు వేశాడు.కాబట్టి... అఖిల్‌కు కనీసం నటన కూడా రాదని ఆది కౌంటర్లు వేశాడు...!!