లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఈమె కెరియర్ ఆరంభంలో కొన్నాళ్లు సినిమా ప్రమోషన్లకు వెళ్లిందేమో.. కానీ దాదాపు దశాబ్ద కాలంగా ఆమె సినిమా ప్రమోషన్లకు హాజరవ్వడం లేదు.అయితే బయట సినిమాల ప్రమోషన్లకే కాకుండా సొంతంగా నటించిన తన సినిమాల ప్రమోషన్లకు కూడా ఆమె ఆసక్తి చూపించదు.ఇక పదుల కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించిన సినిమాలను ప్రమోట్ చేసేందుకు నిర్మాతలు నానా కష్టాలు పడుతున్నా కూడా నయనతార కనీసం ఒక్క ప్రెస్ మీట్ లో పాల్గొనడం లేదంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం చేసేది కాదు.
అయితే ఆ కారణంగా కూడా కొందరు నిర్మాతలు ఆమెను దూరం పెట్టడం జరిగింది. అయినా తన పద్ధతిని మార్చుకోను అంటూ తెగేసి చెప్పింది.అంతేకాదు అదనపు పారితోషికం ఇచ్చిన కూడా గతంలో ప్రెస్ మీట్ కి కానీ ఈవెంట్ కి కానీ హాజరయ్యేందుకు ఆమె ఒప్పుకునేది కాదు. ఇప్పుడు ఆమె తన పద్ధతి మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక పెళ్లి తర్వాత ఆమె చాలా మార్చుకుంది ఈమె. సినిమాల ఎంపిక విషయం నుండి మొదలు పెట్టి పాత్రల ఎంపిక వరకు అనేక విషయాల్లో మార్పు కనిపిస్తుంది.అయితే అదే సమయంలో ఈమె తీసుకొనబోతున్న రెమ్యునరేషన్ కూడా వార్తల్లో నిలుస్తుంది..
గతంలో మూడు నుండి నాలుగు కోట్ల పారితోషకం తీసుకున్న నయనతార ఏకంగా డబుల్ చేసి తన పారితోషికంను 7 నుండి 8 కోట్లకు పెంచేసిందట.ఇకపోతే ఇదే సమయంలో భారీ పారితోషకం ఇస్తే ఇక నుండి తాను నటించిన సినిమాల యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటాను అంటూ కూడా నిర్మాతలకు ఆఫర్ ప్రకటించింది.కాగా నయనతార తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. ఆమె భారీగా పారితోషికం పెంచడం అనేది వారికి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది.ఇక తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈమె తప్పకుండా నటిస్తుంది. అంత భారీ పారితోషం ఎవరిస్తారు అనేది చూడాలి.అయితే ఇకనుండి వరుసగా పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటానంటూ నయనతార ప్రకటించిన నేపథ్యంలో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..!!