కొనెదెల ప్రొడక్షన్స్ తో సినిమా చేయనున్న పవన్...!!

murali krishna
పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలే వున్నాయట.. అన్నీ కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే. అలాగే మరో పక్క రాజకీయాలపరంగానూ పరిస్థితి ఎంతో వాడీ వేడిగా నడుస్తోంది.

ఈ సిట్యువేషన్‌లో పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న ప్రాజెక్టు లు ఎలా పూర్తి చేస్తాడా.? అనే అనుమానాలు కూడా సర్వత్రా నెలకొన్నాయి. ఈ తరుణం లో మరో కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడ ని తాజాగా ప్రచారం జరుగుతోంది.


ఈ సినిమాకి 'వకీల్ సాబ్' డైరెక్టర్ వేణు శ్రీరామ్ కానీ, 'భీమ్లా నాయక్' డైరెక్టర్ సాగర్.కె. చంద్ర కానీ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయనీ సమాచారం.. ముఖ్యంగా సాగర్. కె. చంద్ర పేరునే ప్రముఖంగా వినిపిస్తోంది.


నిజానికి ఈ రెండు సినిమాలూ కూడా రీమేక్ సినిమాలే. కానీ, తాజాగా సీన్ లోకి వచ్చిన ప్రాజెక్ట్ అయితే,స్ట్రయిట్ మూవీ అని తెలుస్తోంది. ఇద్దరి దగ్గరా పవన్ కళ్యాణ్ కోసం పవర్ ఫుల్ స్టోరీస్ వున్నాయని సమాచారం.ఆ రెండింట్లోనూ ముఖ్యంగా సాగర్ వద్ద వున్న స్టోరీ లైన్‌పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై ఓ క్లారిటీ రానుందట.


మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్‌తో బిజీ బిజీగా వున్నారు. ఇది పూర్తి కాగానే ఏ సినిమాని టేకప్ చేస్తారన్న అంశంపై పక్కాగా అయితే క్లారిటీ లేదు కానీ, సముద్ర ఖనితో 'వినోదయసితం' పూర్తి చేసేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయ్. ఈ సినిమా కోసం చాలా తక్కువ రోజులే డేట్స్ కేటాయించారట పవన్ కళ్యాణ్.ఇప్పటికే పవర్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తెలీదు. ఈ సినిమాకు దేవిశ్రీ సంగీత దర్శకుడు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: