మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన
మూవీ లలో హీరోగా నటించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న
రామ్ చరణ్ ఈ సంవత్సరం మార్చ్ 25 వ తేదీన విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్
మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు.
ఈ
మూవీ లో యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక హీరోగా నటించగా , దర్శక ధీరుడు
రాజమౌళి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇలా ఉంటే ప్రస్తుతం
రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో కీయారా అద్వానీ
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,
సునీల్ ,
అంజలి ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. దిల్ రాజు ఈ
మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.
ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే మెగా
పవర్ స్టార్ రామ్ , చరణ్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తేరకెక్కబోయే
మూవీ లో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.
రామ్ చరణ్ ,
గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్
మూవీ ప్రస్తుతం
రామ్ చరణ్ ,
శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న
మూవీ ముగిసిన తర్వాత ప్రారంభం కాబోతున్నట్లు కూడా అనేక వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం
రామ్ చరణ్ ,
గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్
మూవీ ఆగిపోయినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.