రామ్ పోతినేని... బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీకి ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రామ్ పోతినేని తాజాగా ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఈ మూవీ కి తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహించ గా , కృతి శెట్టి ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటించింది . భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది .


ఇలా ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను నిరుత్సా హపరిచిన రామ్ పోతినేని మరి కొన్ని రోజుల్లో టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటు వంటి బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో హీరో గా నటించ బోతున్నాడు . ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది . వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ పాన్ ఇండియా మూవీ గా తేరకేక్కబోతుంది.


ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బోయపాటి శ్రీను తాజాగా అఖండ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో బాలకృష్ణ హీరోగా నటించిన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలు నడుము విడుదల అయిన అఖండ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. ఈ మూవీ లో శ్రీకాంత్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: