పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యేది అప్పుడే..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ కొన్ని సార్లు వాయిదా పడడంతో ఇప్పటి వరకు కూడా ఈ మూవీ షూటింగ్ పూర్తి కాలేదు.


ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత క్రిష్ జాగర్లమూడి 'కొండ పొలం' సినిమాను తెరకెక్కించడం ,  అలాగే పవన్ కళ్యాణ్ కూడా భీమ్లా నాయక్ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడంతో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కొంత కాలం ఆగి పోయింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కొంత కాలం షూటింగ్ జరిగిన తర్వాత మళ్లీ ఆగి పోయింది. ఇది ఇలా ఉంటే తిరిగి ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 17 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.


ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కేవలం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ పైనే పూర్తి ఇంట్రెస్ట్ పెట్టి ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 2 వ తేదీన హరిహర వీరమల్లు మూవీ నుండి చిత్ర బృందం పవర్ గ్లాన్స్ పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ప్రేక్షకుల్లో ఈ మూవీ పై ఉన్న అంచనాలను కూడా ఈ వీడియో ద్వారా పెరిగి పోయాయి. ఈ మూవీ లో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: