నవరసాల్లో అదొక్కటే కష్టం : ధన్ రాజ్
ఇక ధనరాజ్ అంటే అద్భుతమైన కామెడీ టైమింగ్ కి కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు అందరు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి కామెడీ పండిస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ధనరాజు సీరియస్ పాత్రలో కూడా నటిస్తూ తనలో దాగివున్న నటుడిని ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తగా నిరూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఇటీవలే బుజ్జి ఇలా రా అనే సినిమాలో సీఐ కేశవ నాయుడు పాత్రలో నటించాడు ధనరాజ్. పాత్రలో అతను మెప్పించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మనందరికీ తెలిసిన ధనరాజ్ యేన ఇలా ఇంత అద్భుతంగా నటించింది అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.
ఇకపోతే ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ధన్రాజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీరియస్ గా ఉన్న రోల్స్ చేయడం ఈజీనా లేకపోతే కామెడీ చేయడం ఈజీనా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. నవరసాలలో నవ్వించడమే కష్టం అంటూ సమాధానం చెప్పాడు ధన్ రాజ్. ఎందుకంటే ఒక వ్యక్తిని ఏడిపించాలి అన్న కోపం తెప్పించాలి అన్నా చాలా ఈజీ. కానీ అదే వ్యక్తినీ నవ్వించడం మాత్రం ఎంతో కష్టం కామెడీ చేసిన వాడు ఏ పాత్ర అయినా చేస్తాడు అన్నారు వెనకటికి ఒకరు అంటూ సమాధానం చెప్పాడు.