ఎన్టీఆర్: కృష్ణం రాజు కోసం షూటింగ్ క్యాన్సిల్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు అనారోగ్యం కారణంగా ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా బాధగా వుంది. ఇక నటుడిగా, కథానాయకుడిగా కృష్ణం రాజుకు తెలుగు చిత్రసీమలో జన్మనిచ్చిన సినిమా 'చిలకా గోరింక'. అయితే హీరోగా మాత్రం ఆయనకు పునర్జన్మ ఇచ్చిన సినిమా 'కృష్ణవేణి'. నిర్మాతగా ఆయనకు అది తొలి సినిమా కూడా ఇదే. హీరోగా తొలి సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత సుమారు 60 సినిమాల్లో విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ రోల్స్ చేశారు కృష్ణం రాజు. మళ్ళీ 'కృష్ణవేణి' సినిమాతో హీరోగా మారారు. అది ఘన విజయం సాధించింది. ఆ సినిమా శతదినోత్సవ వేడుకకు ఎన్టీఆర్, బసవ తారకం దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అందుకోసం, ఆయన ఏకంగా షూటింగ్ క్యాన్సిల్ చేయడం విశేషం.హైదరాబాదులో శాంతి థియేటర్‌లో 'కృష్ణవేణి' సినిమా వంద రోజుల వేడుక జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వస్తే బావుంటుందని ఆయన్ను ఆహ్వానించడానికి కృష్ణం రాజు, ఆయన సోదరుడు వెళ్లారు.అయితే ఫంక్షన్ చేయాలనుకున్న రోజు ఎన్టీఆర్ షెడ్యూల్ ఖాళీగా లేదు. 'తాతమ్మ కల' సినిమా షూటింగ్ ఉంది.


పైగా స్టార్ ఆర్టిస్ట్ భానుమతితో కాంబినేషన్ సీన్. ఆవిడ చాలా బిజీ ఆర్టిస్ట్. అందువల్ల, ఎన్టీఆర్ రావడం కష్టమని ఆఫీసులో కృష్ణం రాజును కలిసిన దర్శక, రచయితలు చెప్పారు. ఎన్టీఆర్‌ను కలిసిన కృష్ణం రాజు ఫంక్షన్ గురించి చెబితే 'సాయంత్రం ఒకసారి ఫోన్ చేయండి' అని సమాధానం వచ్చింది. 'ఫోన్ ఎందుకండీ? మేమే వచ్చి కలుస్తాం' అని చెప్పి కృష్ణం రాజు సెలవు తీసుకున్నారు. సాయంత్రం వెళ్లేసరికి భానుమతితో మాట్లాడి షూటింగ్ కోసం మరో డేట్ ఫిక్స్ చేయమని, తాను 'కృష్ణవేణి' వందరోజుల వేడుకకు హాజరవుతానని ఎన్టీఆర్ చెప్పారు. ఆ తర్వాత సతీసమేతంగా వస్తే బావుంటుందని రిక్వెస్ట్ చేస్తే అందుకూ ఎన్టీఆర్ సరేనని అన్నారు.కృష్ణం రాజు టికెట్స్ తీస్తానని అంటే వద్దని చెప్పి సొంత డబ్బులతో టికెట్స్ తీసుకుని చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు ఎన్టీఆర్. అప్పుడు 'కృష్ణవేణి' సినిమా వేడుకలో ఎన్టీఆర్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇలా అప్పట్లో మన సీనియర్ హీరోల మధ్య అనుబంధం ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: