కృష్ణంరాజు భౌతికకాయానికి ఇస్తున్న గౌరవం పై వర్మ సంచలన వ్యాఖ్యలు !
న్యూస్ ఛానల్స్ కూడ నిన్న ఉదయం నుండి ఎక్కడా బ్రేక్ లేకుండా కృష్ణంరాజు పై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేసి ఆయన మృతికి తమ సంతాపం తెలియచేసాయి. ఇంత జరుగుతున్నప్పటికీ రామ్ గోపాల్ వర్మకు సంతృప్తి కలగలేదు. ప్రతి విషయంలోనూ ఎదో ఒక వివాదం సృష్టించి ఆ వివాదంతో సంచలనంగా మారాలని ప్రయత్నించే వర్మ కృష్ణంరాజు మరణం విషయంలో కూడ రాజకీయాన్ని చేసి సంచలనంగా మారాడు.
ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యల పై నెలరోజులు షూటింగ్ లు బంద్ చేసిన టాలీవుడ్ నిర్మాతలు కృష్ణంరాజు మరణానికి సంతాపంగా ఎందుకు షూటింగ్ లు బంద్ చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన విషయాలలో టాలీవుడ్ టాప్ హీరోలు ఎందుకు సలహా ఇవ్వరు అంటూ వర్మ ప్రశ్నిస్తున్నాడు. గతంలో అక్కినేని నాగేశ్వరావు చనిపోయినప్పుడు షూటింగ్ లు బంద్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అలాంటి సాంప్రదాయం కృష్ణంరాజు విషయంలో ఎందుకు కొరవడింది అన్నది వర్మ అభిప్రాయం. అంతేకాదు మరణం అన్నది ఎవరికైనా వస్తుందని ఇండస్ట్రీలో రానున్న కాలంలో ఇలాంటి మరణాలు ఎన్నో సంభవించ వచ్చని అప్పుడు గౌరవంగా షూటింగ్ లు నిలుపుదల చేయడం ఆ చనిపోయిన వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం అంటూ వర్మ అభిప్రాయపడుతున్నాడు. వర్మ చెప్పే అభిప్రాయాలలో కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ మరికొన్ని గంటలలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతున్న నేపధ్యంలో షూటింగ్ ల నిలుపుదల జరుగుతుందా అన్నది సమాధానం దొరకని ప్రశ్న. ఈ విషయమై టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి..