కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగేది అక్కడేనా.. కారణం..!!
ఈ క్రమంలోనే ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు చేవెళ్ల మెయినాబాద్ దగ్గర కృష్ణంరాజుకు ఉండే ఒక మామిడి హౌస్ లో ఈ అంత్యక్రియలు జరగబోతున్నట్లు సమాచారం. ఇంటి నుండి ఉదయం 11: 30 గంటలకు ఆయన పార్థివ దేహం బయలుదేరుతుందట. కృష్ణంరాజు గారి అంతిమయాత్రలో ఎంతోమంది ప్రముఖులు సైతం పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా కనక మామిడి హౌస్ లోనే ఎందుకు అంతక్రియలు జరపబోతున్నారు అనే విషయం ఇప్పుడు అందరిలోనూ హాట్ టాపిక్ గా మారుతోంది. అలా ఎందుకు జరుపుతున్నారు అంటే అది ఆయన సొంత ఫామ్ హౌస్ అట. అది ఎంతో ఇష్టంగా ఐదు సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారట కృష్ణంరాజు.
అంతేకాకుండా అక్కడే నివసించడం కోసం ఒక ఇంటిని కూడా నిర్మిస్తున్నారు కానీ అది నిర్మాణం పూర్తి కాకుండానే కృష్ణంరాజు మరణించడం జరిగింది. కృష్ణంరాజు ఒక నటుడుగా, సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి స్నేహితుడుగా, రాజకీయవేత్తగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే కృష్ణంరాజు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు మరణ వార్తతో ప్రభాష్ ఆభిమానులు కృష్ణంరాజు అభిమానులు సైతం ఒక్కసారిగా తీవ్రంగా తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ తండ్రి సూర్యం రాజు మరణించడంతో ఆ ఇంటి పెద్దదిక్కుగా కృష్ణంరాజు ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆయన కూడా మరణించడంతో ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది అని పలువురి తమ బాధను తెలియజేస్తున్నారు.