అన్ని ఇండస్ట్రీల్లో రష్మిక మందన్నా ప్రస్తుతం బ్రేకుల్లేని బండిలాగా దూసుకుపోతోంది. ఇక ఈ అమ్మడి స్పీడును అడ్డుకోవడం ఎవరి వల్ల కావడం లేదంట..ఎందుకంటే ఈ మద్దుగుమ్మ నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే అని అంటున్నారు. ఇక రష్మిక ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా పట్టిందల్లా బంగారమే అన్న సామేతకు ఆమె సరిగా తూగుతుంది.అయితే తమిళ, కన్నడ, తెలుగు.. తాజాగా బాలీవుడ్‌లో జెండా పాతేందుకు ఈ కన్నడ బ్యూటీ రంగం సిద్ధం చేసుకుంటుందట..ఇక కన్నడ ఇండస్ట్రీ నుంచి రష్మిక.. తెలుగులో చలో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
అయితే తొలి సినిమా విజయం ఆమెకు వరుసగా అవకాశాలను తీసుకొచ్చింది.కాగా ఆ తర్వాత విజయ్‌తో గీతగోవిందం, డియర్ కామ్రేడ్, హీరో నితిన్‌తో భీష్మ.. అల్లుఅర్జున్ తో పుష్ప పార్ట్-1 సినిమాలు చేసింది.తాజాగా సీతారామం మూవీలో నటించి మంచి హిట్ కొట్టింది.ఇకపోతే. ప్రస్తుతం పుష్ప పార్ట్-2 సినిమాలో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.ప్రస్తుతం తన చేతిలో బోలెడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇక పలు మల్టీనేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా చేస్తున్న రష్మిక.. స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తోంది.అయితే త్వరలోనే బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో యానిమల్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.
కాగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తన గ్లామర్ షోతో కుర్రకారు మతులుపోగొడుతుంది.ఇక మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక.. ఈ మధ్యకాలంలో అందాల ప్రదర్శన చేసేందుకు కూడా సిద్ధపడుతోంది.త్వరలో బాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు తాజాగా డేరింగ్ డెసిషన్ ఒకటి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక అదేంటంటే ఇప్పటివరకు క్యూట్ లుక్స్, సెమీ బోల్డ్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే బికినీ లో కనిపించడానికి కూడా సై అన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయం తెలిసి తన అభిమానులు ఎంతో క్యూరియాసిటీగా ఉన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు..!!