రజినీ టైటిల్ తో శింబు హిట్ కొట్టేనా!!
సూర్య, కార్తీ, విక్రమ్, కమల్, రజినీకాంత్, విజయ్ దళపతి లాగే తమిళ స్టార్ శింబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయన గతంలో చేసిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించాడు. ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పరచుకున్న ఈ హీరో ఆ తర్వాత ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. అయన సినిమాలు తెలుగు లో విడుదల కాలేదనే చెప్పాలి. అలా చాలా రోజుల తర్వాత ఇటీవలే ‘మానాడు’ సినిమాతో సూపర్ హిట్‌ను సాధించాడు. తెలుగు లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. గత కొంత కాలం నుండి వరుస ప్లాప్‌లు వెంటబడుతున్న సమయంలో శింబుకు మానాడు మంచి కంబ్యాక్ ఇచ్చింది.
అయితే ఈ సినిమా తెచ్చిన హిట్ సంబరంలో ఆయనకు మరిన్ని సినిమాలు వచ్చాయి ఇప్పుడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను అలరించే సినిమాలనే చెప్పాలి. అందులో ‘వెందు తనింధాతు కాదు’ ఒకటి. తెలుగు లో ఈ సినిమా కు ముత్తు టైటిల్ ను నిర్ణయించారు. ఇది గతంలో రజినీకాంత్ హీరో గా నటించిన సినిమా. గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడులైన పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా శింబు కి ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా యొక్క విడుదల జరగనుంది.