వాట్ నెక్స్ట్.. కన్ఫ్యూజన్ లో రౌడీ అభిమానులు!!
ఈ దెబ్బతో పూరీతో చేయాల్సిన `జనగణమన` కూడా ఆగిపోయిందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయడానికి నిరాకరించడం. ఈ చిత్రం నుంచి నిర్మాతలు బ్యాక్ అయ్యారని సమాచారం. ఫ్లాప్ కాంబో లో ఈ సినిమా ను చేయడానికి అయన ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. దీంతో పూరీ సైతం దీన్నిపక్కన పెట్టారట. ఇప్పుడు పూరి తన తదుపరి సినిమా చేస్తుంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ మరో భారీ చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అది గాసిప్ లాగా రావడమే తప్పా ఎవరితో చేస్తున్నాడో అధికారికంగా రాకపోవడం అందరిని ఎంతో నిరుత్సాహ పరుస్తుంది.
కొంతమంది ఓ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అంటుంటే ఇంకా కొంతమంది లేదు మరో పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అంటున్నారు. కానీ ఎవరితో సినిమా చేస్తున్నాడో అన్న విషయం పై క్లారిటీ రావడం లేదు. రౌడీ ఫ్యాన్స్ ఈ విషయమై ఎంతో కంఫ్యూజ లో ఉన్నాడని చెప్పాలి. ఇకపతే విజయ్ దేవరకొండ హీరోగా `ఫ్యామిలీ మ్యాన్ 2` దర్శకులు ఓ సినిమా చేయబోతున్నారని, ఇది ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యిందని, ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని తెలుస్తుంది.ఇంకోవైపు హరీష్ శంకర్ అంటున్నారు. దీనిలో ఏది ఫైనల్ అవుతుందో తొందరలోనే తెలియనుంది.