రెజీనా ప్రేమలో పడింది ఎవరు !

Seetha Sailaja
‘శివ మనసులో శృతి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా కెరియర్ ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. టాప్ యంగ్ హీరోలతో నటించాలి అని ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె ప్రయత్నాలు ఏమి కలిసిరాలేదు. ఎక్స్ పోజింగ్ తో యూత్ కు బాగా కనెక్ట్ అవ్వాలని ఆమె ప్రయత్నించినప్పటికీ ఆవిషయంలో కూడ ఆమెకు నిరాశ మిగిలింది.


ఆమధ్య కనీసం ఐటమ్ సాంగ్ చేసి అయినా క్రేజ్ పెంచుకోవాలని ‘ఆచార్య’ మూవీలో చిరంజీవి పక్కన ఐటమ్ సాంగ్ లో నటించినప్పటికీ ఆమెను యూత్ కాని మాస్ ప్రేక్షకులు కాని పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ గా ‘శాకిని డాకిని’ మూవీలో నటిస్తోంది. కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ కు రీమేక్ ఇది.




యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈమూవీని దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించడంతో ఈమూవీలో ఏదైనా వెరైటీ ఉందా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో నిర్మింపబడ్డ ఈమూవీ ఈనెల 16న విడుదల కాబోతోంది. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా తన పెళ్ళి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదా అన్నది తనకు తెలియదని కామెంట్స్ చేసింది.


అంతేకాదు తాను గతంలో ఒకరిని ప్రేమించానని అయితే కొన్ని కారణాల వల్ల తమ ప్రేమ 2020లోనే ముగిసిపోయింది అని చెపుతూ ఆ షాక్ నుండి తాను బయటపడటానికి తనకు చాల సమయం పట్టింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తాను ఎవర్ని ప్రేమించడం లేదనీ భవిష్యత్ లో మరెవర్ని అయినా ప్రేమించి పెళ్ళి చేసుకుంటాననే నమ్మకం తనకు లేదని అంటూ ఒకరిపై ఆధారపడకుండా సొంతంగా ఎలా జీవించాలో చిన్నతనం నుండి తన తల్లి నేర్పిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. దీనితో కొంతకాలం క్రితం రెజీనా ను ప్రేమించి మళ్ళీ యూటర్న్ తీసుకున్న వ్యక్తి ఎవరు అంటూ సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: