స్టేజ్ పైనే నిర్మాతకు క్షమాపణలు చెప్పిన అడవి శేషు.. కారణం..!!

Divya

 హీరో అడవి శేషు నిన్నటి రోజున శాకిని డాకిని చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. ఈ సినిమా విడుదల కాబోతున్న తరుణంలో ఈ సినిమానీ నిర్మించిన సునీత తాటి గురించి మాట్లాడుతూ ఆమెకు క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఆమె వ్యక్తిగతంగా కూడా కలిసి చెప్పానని మరొకసారి అందరి ముందు కూడా సునీత గారికి క్షమాపణలు చెబుతున్నాను అంటు అడవి శేషు తెలియజేశారు. నిర్మాత సునీతకి అడవి శేషు ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వాటి గురించి తెలుసుకుందాం.


అడవి శేషు..మేజర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఈ సినిమాలో అడవి శేషు తో పాటు శోభిత ధూళిపాళ కీలకమైన పాత్రలో నటించింది. ఇక ఈమె పాత్రకు తల్లి పాత్రలో నిర్మాత అయిన సునీత తాటి నటించారు. ఈ సినిమా కోసం సునీత తాటిపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించడం జరిగిందట కానీ చివరికి అందులోని సన్నివేశాలు లేకుండా సినిమాను విడుదల చేయడం జరిగిందని తెలిపారు శేషు. ఒక్క సన్నివేశంలో కూడా ఆమె కనిపించలేదని రన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల ఆమె నటించిన సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందని అడవి శేషు తెలియజేశారు.


ఆమెను సినిమాలో చూపించు ఉంటే బాగుండేది అని తన కూడా అనుకున్నానని తెలిపారు. కానీ సినిమా టైమ్ ఎక్కువగా ఉండటం వల్ల ఏం చేయలేకపోయామని అడివి శేషు తెలిపారు. సినిమాలో సునీత గారు చేసింది మంచి పాత్ర కానీ రాకుండా పోయింది అని అడవి శేషు ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ఆమెకు పర్సనల్గా ఒక గిఫ్ట్ ఇచ్చి మరి క్షమాపణలు కోరానని తెలిపారు. అయితే ఇప్పుడు స్టేజ్ పైన అందరి ముందు క్షమాపణలు చెప్పి మరొకసారి తన మంచి మనసును చాటుకున్నాడు అడవి శేషు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: