విక్రమ్ 'కోబ్రా' మూవీ 'ఓటిటి' లోకి వచ్చేది అప్పుడే..?

Pulgam Srinivas
చియాన్ విక్రమ్ తాజాగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కోబ్రా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యింది.  


కాగా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఫెయిల్యూర్ గా మిగిలిపోయిన కోబ్రా మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటువంటి సోనీ లీవ్ 'ఓ టి టి' సంస్థ దక్కించుకుంది.


అలాగే ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో సోనీ లివ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లీవ్ 'ఓ టి టి' సంస్థ కూడా అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. కాకపోతే సోనీ లీవ్ సంస్థ ఈ మూవీ ని ఏ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. సెప్టెంబర్ 23 వ తేదీన లేదా సెప్టెంబర్ 30 వ తేదీన సోనీ లివ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కోబ్రా మూవీ ని స్ట్రీమింగ్  చేసే అవకాశం ఉన్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: