నాచురల్ స్టార్
నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే
నాని తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంత మైన
మూవీ లలో నటించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే
నాని ఈ సంవత్సరం అంటే సుందరానికి
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వా లేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది .
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
నాని ,
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న
దసరా అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు . ఈ
మూవీ లో
నాని సరసన
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా పూర్ణ ఈ
మూవీ లో ప్రతి నాయక పాత్రలో కనిపించ బోతున్నట్లు తెలుస్తుంది. ఈ
మూవీ ని పాన్
ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ
మూవీ సింగరేణి బొగ్గు గని కార్మికుల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ లో
నాని ఊర
మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.
ఇప్పటికే ఈ
సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటిలో
నాని తన ఊర
మాస్ లుక్ లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం
నాని 'దసరా'
మూవీ కి అదిరి పోయే రేంజ్ ట్రియేటికల్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
నాని కెరియర్ లోనే ఏ సినిమాకు జరగని రేంజ్ లో
దసరా మూవీ కి ట్రియేటికల్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా
దసరా మూవీ తో
నాని అద్భుతమైన బిజినెస్ ని జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.