ఇటీవల కాలంలో వరస పాపులను అందుకుంటున్న కొంతమంది హీరోలకు సరైన టైంలో విజయాలు దక్కాయని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో అంచనాలు పెట్టుకొని వారు చేసిన ఈ సినిమాలు తప్పకుండా హిట్ అందుకోవాల్సిన సమయంలో ఆ సినిమాలు విజయాలను అందుకున్నాయి. దాంతో వారి కెరియర్లకు ఇప్పుడు ఎలాంటి ధోకా లేదని చెప్పాలి. ఇప్పుడు వారికీ మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చు. కొంతమంది పెద్ద నిర్మాతలు వీరితో సినిమాలను చేసేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నారు.
వాస్తవానికి ఈ హీరోలు ఇప్పుడు చేసిన హిట్ సినిమాలు కంటే ముందు ఎంతో టెన్షన్ లో ఉన్నారు. ఆ విధంగా విజయం అందుకోవడం వారిని ఎంత గానో ఆనందపరుస్తుంది. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. అంతకుముందు ఆయన చేసిన సినిమాలేవి కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. దాంతో ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకొని చేయగా అది ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఇక మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సీతారామం సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో వచ్చిన విజయం అంతా ఇంతా కాదు. ఓటీటీ లో సైతం ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఇటీవలే ప్రేక్షకులను అలరించిన ప్రేమకథా సినిమాలలో ఇది టాప్ పొజిషన్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే శర్వానంద్ కి కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి విజయం వచ్చిందని చెప్పాలి. వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచిన ఈ హీరో ఇప్పుడు చేసిన ఒకే ఒక జీవితం సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకోక అది భారీ విజయాన్ని అందుకొని ఆయనకు ఉపశమనాన్ని కలిగించింది. ఈ సినిమా కు ప్రముఖుల దగ్గరి నుంచి మంచి పెరోస్తుంది. వసూళ్ల పరంగా ఈ సినిమా కి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.