దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ తన కెరియర్ ని దర్శకుడిగా మొదలు పెట్టినప్పటి నుండి ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా దర్శకుడుగా గొప్ప గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇలా దేశ వ్యాప్తంగా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కీయారా అద్వానీ హీరోయిన్ గా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు కొన్ని సంవత్సరాల క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన భారతీయుడు మూవీ కి సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ ని ప్రస్తుతం దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్నాడు.
ఈ రెండు మూవీ లపై కూడా దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్ తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... దర్శకుడు శంకర్ తన తదుపరి మూవీ ని సూర్య మరియు కిచ్చ సుదీప్ లతో 1000 బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు , ఎస్ వెంకటేష్ అనే ప్రముఖ రచయిత చారిత్రక నేపథ్యంలో రాసిన నేర్పరి అనే నవల ఆధారంగా ఈ మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.