టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ యంగ్ హీరో నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఇటీవల నాటురల్ స్టార్ నాని 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాపై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కానీ సినిమాకి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.ఇక ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ హీరో 'దసరా' అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు.ఇక సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
కాగా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.అయితే ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఇక దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. ఇదిలావుంటే ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇక ఒక్క నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.50 కోట్లు వచ్చి చేరాయి.అయితే ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ ను కూడా అమ్మేశారట. ఇకపోతే చదలవాడ శ్రీనివాసరావు రూ.27 కోట్లు చెల్లించి 'దసరా' థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇంకా ఓవర్సీస్ బిజినెస్ జరగలేదు. దానికి కూడా భారీ మొత్తాన్నే కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ఇక ఇప్పటివరకు అయితే రూ.80 కోట్లకు దగ్గరగా సినిమా బిజినెస్ జరిగింది. ఇకపోతే ఈ సినిమా నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే అరవై కోట్ల రేంజ్ లో బడ్జెట్ అనుకున్నారు కానీ ఇప్పుడు డెబ్భై కోట్లు అయిపోతుందని సమాచారం. కాగా ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.ఇక ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు...!!