టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ యాడ్స్‌లో నటించేది ఎవరు? యాడ్స్ నుండి ఎక్కువ డబ్బులు సంపాదించేది ఎవరు? అంటే ఆ లెక్కలు అయితే సరిగ్గా చెప్పలేం కానీ..ఆ హీరో మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్‌బాబు అని చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు కాదు చాలా ఏళ్ల నుండి సూపర్ స్టార్ కు అండార్స్‌మెంట్‌లు భారీగానే సాగుతున్నాయి. అందుకునే మొత్తం కూడా భారీగానే ఉంటుందని టాక్. అయితే తాజాగా మహేష్ చేసిన ఓ యాడ్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. కొందరైతే మహేష్ అన్న నువ్వేంటి నీ రేంజ్ ఏంటి అని అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే?'పడమటి సంధ్యా రంగం' పేరుతో ఇటీవల ఓ ప్రోమో యూట్యూబ్‌లో తిరుగుతోంది మీరు కూడా చూసే ఉంటారు. ఇద్దరు అమ్మాయిలు, ఒకరు పాష్ అయితే, మరోకకు ఇండియన్ లోకల్. ఈ సీరియల్ అనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన ప్రోమో అది. అందులో ఏముంది తప్పు అనుకుంటున్నారా? అందులో మహేష్‌బాబు కనిపించాడు అదే ఇక్కడ సమస్య. పెద్ద పెద్ద బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా చేసే మహేష్.. ఇలా ఓ టీవీ సీరియల్‌కు ప్రచారం చేయడం ఏంటన్న అని అంటున్నారు ఫ్యాన్స్.ఇక అక్కడితో ఆగకుండా.. తను వస్తే వచ్చాడు, కూతురు సితారను కూడా ఇలాంటి యాడ్‌లోకి తీసుకురావడం ఎందుకు అని అడుగుతున్నారు. అభిమానులు ఏదో ఇబ్బందితో అడుగుతుంటే.. నెటిజన్లు, ట్రోలర్లు అయితే మహేష్.. మాకేంటిది మహేషా అని అడుగుతున్నారు.
అసలు మహేష్ ఎందుకిలా చేశాడు అని చూస్తే.. 'జీ తెలుగు' ఛానల్‌కు మహేష్‌బాబు బ్రాండ్ అంబాసిడర్ అట. దీని కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నాడు అని సమాచారం. కాబట్టి చిన్న యాడ్ అయినా పెద్ద యాడ్ అయినా తనను నమ్మిన వారికి అన్యాయం చెయ్యకూడదు కదా.అందుకే ఈ యాడ్‌లట.గతంలో పాన్ బహార్ గుట్కా యాడ్ చేసి కొన్ని విమర్శలకు గురైన మహేష్.. ఇప్పుడు ఇలా సీరియల్ ప్రోమోలో కనిపించి ఇంకా హర్ట్ చేశాడు అంటున్నారు. అయితే ఇక్కడే కొంతమంది మహేష్ ఏం సంపాదించినా అది పిల్లల గుండె ఆపరేషన్లకు ఖర్చు పెట్టడానికే కదా అని అంటున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. కానీ అభిమానుల బాధ అభిమానులది.ఇవన్నీ పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో మరోసారి 200 కోట్ల భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో ఫుల్ బిజీ అయ్యాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.