OTT: వల్ల చాలా ఇబ్బంది పడుతున్న స్టార్ హీరోలు..!!
మలయాళం లో విడుదలైన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. అందుచేతన దర్శక నిర్మాతలు సైతం ఈ కథలను కొనడానికి ఎక్కువగా సిద్ధమవుతున్నారు. ఇక అంతే కాకుండా ఈ మధ్యకాలంలో అన్ని ఇండస్ట్రీలలో అన్ని సినిమాలు బాగా పాపులర్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాలు డబ్బింగ్ వర్షన్ ఉందంటే చాలు చూడడానికి సిద్ధం అయిపోతున్నారు ప్రేక్షకులు. దీంతో మలయాళం సినిమాలకు తెలుగులో ఓటీటి లో బాగా పాపులర్ అవుతూ ఉన్నాయి. దీంతో మలయాళ సినిమాలు అన్ని ఓటీటీ సంస్థలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉన్నాయి.
ఇక ఇదే సినిమాలను తెలుగులో రీమిక్స్ చేద్దామని హక్కులను కొనుగోలు చేసిన నిర్మాతలు దర్శకులు చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కొన్ని సినిమాలు పది కోట్లు పెట్టుకున్నప్పటికీ రూ. 100 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇక టోవీనో థామస్ నటించిన తుల్లుమాల అని మలయాళ చిత్రాన్ని సిద్దు జొన్నలగడ్డ చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా సమాచారం. అయితే ఇది ఇప్పటివరకు బాగానే ఉన్నా ఈ చిత్రం ఓటీటి లో తెలుగు వర్షన్ లో రావడంతో ఈ సినిమా చూసిన మళ్లీ ప్రేక్షకులు అలాంటి సినిమాలను చూస్తారా అనేది ఇక్కడ సమస్యగా మారుతోంది. ఇక మధ్య వచ్చిన మానాడు, లూసిఫర్ సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గతంలో కూడా కాటమరాయుడు సినిమా పరిస్థితి ఇలానే మారిపోయింది. ఇక వేరే కాకుండా చాలామంది హీరో ఇలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.